ఖమ్మం బైపాస్ రోడ్ వరద కాల్వ పనులు వెంటనే పూర్తి చేయాలి
06-07-2026 01:13 AM
ఖమ్మం, (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని సీపీఎం ఖమ్మం పట్టణం కార్యదర్శి వై. విక్రమ్ అధికారులను డిమాండ్ చేశారు. దాదాపు రెండు కోట్లతో నిర్మిస్తున్న కాల్వ పనులు ఇష్టారాజ్యంగా, నత్తనడకగా జరుగుతున్నాయని, ఆ పనుల నాణ్యతపై కమిషనర్ పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు విస్తరణ, వివిధ ప్రాంతాల్లో డ్రైనేజీ పనుల వేగం పై మంత్రి, కమిషనర్ దృష్టి సారించాలి వై విక్రమ్ కోరారు.






