8 August, 2026 | 10:39 PM

హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను వెంటనే అమలు చేయాలి

08-08-2026 09:12 PM

యాదాద్రి పరిరక్షణ కమిటీ

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం  కొండపైన  నిర్వహిస్తున్న వర్తక సంఘం  వ్యాపారాలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ఏఈఓ శ్రవణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యాదగిరిగుట్ట కొండ పైన వర్తక సంఘం పేరుతో కొనసాగుతున్న దుకాణాలను హైకోర్టు  ఇచ్చిన స్టే ఆర్డర్ ను నెంబర్ (W. P No 24140/2026)  తక్షణమే అమలు చేయాలని కోరతూ  వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్న నేపథ్యంలో వర్తక సంఘం పేరుతో కొనసాగుతున్న  దుకాణాల్లో వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేసి, న్యాయస్థాన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను కోరడం జరిగిందని అన్నారు.