8 August, 2026 | 10:39 PM

జిల్లా డెఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

08-08-2026 09:13 PM

మంచిర్యాల క్రైం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా డెఫ్ స్పోర్ట్స్ (మూగ, చెవిటి క్రీడాకారుల) అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాబోయే మూడేళ్ల కాలపరిమితికి పనిచేసేలా నూతన బాధ్యులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా గొర్రె దేవయ్య, ఉపాధ్యక్షుడిగా జిల్లా చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా జె. అరుణ్ కుమార్, సహ కార్యదర్శిగా ఈ కుమార్, కోశాధికారిగా పి చక్రధర్, కార్యవర్గ సభ్యులుగా గడం రాజేశ్వర్, మోటపలుకుల ప్రశాంత్, ఎండీ. యాసిర్ అఫారత్ లు ఎన్నికయ్యారు.