calender_icon.png 16 October, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్ పోడియం అందజేత

15-10-2025 07:31:59 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకి భారత్ స్టీల్ ఫాబ్రికేటర్ రూ.12,000/- విలువ గల స్టీల్ పోడియాన్ని కన్నయ్ లాల్, ప్రకాష్ పాఠశాల అధికారులకు అప్పగించారు. పాఠశాల ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు ఈ దాతకు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల శ్రేయస్సు కోసం సమాజం నుంచి ఇలాంటి సహకారాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు కొడిపాక వేణుగోపాల్, సమితి కార్యదర్శి నాగుల శ్రీనివాస్, పాఠశాల కార్యదర్శి భోగ మధుకర్, సభ్యులు జంజిరాల శ్రీనివాస్, కార్యాలయ ప్రముఖ్ ఇందూరి రాజ్ కుమార్ పాల్గొన్నారు.