15-10-2025 07:29:49 PM
పాపన్నపేట (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు మోటార్ పైపు సరిచేస్తూ మంజీర నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుర్తివాడలో చోటుచేసుకుంది. ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పక్రమొల్ల ఆబేద్(53) గ్రామ శివారులో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట ఎండిపోవడంతో మోటార్ సరి చేయడానికి గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మంజీర నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ మోటర్ పైపు సరి చేస్తూ ఆబేద్ నీట మునిగాడు. ఎంతటికి పైకి రాకపోవడంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం మంజీరా నదిలో వెతికినప్పటికీ మృతదేహం ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం వెతకగా ఆబేదు మృతదేహం లభ్యమైనది. ఆబేద్ భార్య సహనాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.