15-10-2025 07:34:02 PM
నిర్మల్ రూరల్: బాల్యవివాహాల నివారణకై ప్రతి ఒక్కరూ ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ పైజాన్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో బాల్య వివాహాలను సేద చట్టం అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. ప్రతి గ్రామంలో బాల్య వివాలు జరగకుండా అధికారులు ప్రజలకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి మురళి, అధికారులు శరత్, హరిత రజిత, అనురాధ పాల్గొన్నారు.