calender_icon.png 20 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ వాల్‌పోస్టర్లు ప్రారంభం

20-12-2025 12:47:30 AM

అయిజ, డిసెంబర్ 19: జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో  హార్ట్ ఫుల్ నెస్ అని మెడిటేషన్ గోడపత్రికలను  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ప్రారంభించారు .  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉరుకులు పరుగులతో కాలo నడుస్తుందని ఇటువంటి సమయంలో ప్రతి వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు భయంకరమైన రోగాల బారిన పడి చనిపోతున్నారన్నారు .

కావున ప్రతి వ్యక్తి రోజు ఒక గంట సేపు మెడిటేషన్ చేయాలనీ మానసిక రుగ్మతల నుండి బయటపడి ఆరోగ్యంగా జీవించే ఆస్కారం ఉందన్నారు . ఈ నెల 21వ తేదీ  రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఆన్లైన్ మెడిటేషన్ లో పాల్గొని ఆరోగ్యాన్ని సుఖవంతంగా చేసుకోవాలన్నారు .  ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ మెంబెర్ రాజేష్ మరియు వీరన్న, సురేష్, మహేంద్ర, వీరేష్, అమర్,భాస్కర్  పాల్గొన్నారు.