19 March, 2026 | 9:58 AM

‘దశలవారీగా అభివృద్ధి’

29-09-2024 12:09 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): దశలవారీగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని వాల్మీకి నగర్‌లో అమృత్ పథకంలో భాగంగా 10 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమాద్, బీజేపీ నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, దయాకర్, రఘుపతి, భరత్ పాల్గొన్నారు.