9 June, 2026 | 7:52 PM

స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా మెయింటెనెన్స్ చేయాలి

09-06-2026 06:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ఎరువులు విత్తనాలు సరఫరా చేసే దుకాణాల్లో స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు బోర్డుపై రాయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సోమవారం జిల్లాలో పలు ఎరువుల, విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్లైన్ స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. పత్తి ఎరువులు పక్కదారి పట్టకుండా అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని సూచించారు. ఎరువులు విత్తనాల విషయంలో మోసాలకు పాల్పడు వారిపై  లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్ స్థానిక అధికారులు పాల్గొన్నారు.