4 May, 2026 | 3:28 PM

Breaking News

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •  

ఈడీ వాహనంపై రాళ్ల దాడి

11-03-2025 11:26 PM

భూపేశ్ బఘేల్ ఇంటి నుంచి వస్తుండగా ఘటన...

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాహనంపై రాళ్ల దాడి చేయడం సంచలనం కలిగించింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఇంటి నుంచి వాహనం తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. తమ వాహనంపై దాడికి పాల్పడిన వారిపై ఈడీ అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కాగా మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోమవారం ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో బిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భూపేశ్ బఘేల్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకొని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ వాహనంపై రాళ్ల దాడి చేయడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈడీ తనిఖీలపై బఘేల్ కార్యాలయం స్పందించింది. ఏడేళ్లుగా కొనసాగుతున్న తప్పుడు కేసును కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. కానీ ఈడీ అధికారులు మాత్రం తనీఖీలు చేయడం ఆపడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.