10-11-2025 12:00:00 AM
- మొర్రెడు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా
- పెరిగిపోతున్న ఇసుక మాఫియా
- పట్టించుకోనిఅధికారులు
ములకలపల్లి, నవంబర్ 9,(విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణాకు మొర్రేడు వాగు స్థావరంగా మారింది. ఈ వాగు నుం చి రాత్రి,పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు ఇసుకను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ములకలపల్లి మండలం లోని గుర్రాలకుంట, ఆనందపు రం, సీతారాంపురం,వేముకుంట,ఒడ్డు రామవరం, వేపకొయ్యరామారం, కొత్తూరు గ్రా మాల శివారు ప్రాంతం నుంచి ఈ ముర్రేడు వాగు ప్రవహిస్తుంది. ఈ ప్రాంతమంతా పా రిశ్రామిక పట్టణమైన పాల్వంచకు దగ్గరగా ఉంటుంది.
పాల్వంచలో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం,భవన నిర్మాణాలకు ఈ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఎంత దూరాన ఉన్నా, ఏ పట్టణానికైనా ఇక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇసుక ను రవాణా చేస్తూ అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు.ముర్రేడు వాగులో నాణ్యమై న ఇసుక లభిస్తుండడంతో అక్రమార్కుల క న్ను ముర్రేడు వాగుపై పడి ఇసుకను యదేచ్చగా తోడేస్తున్నారు. ఇప్పటికే వందల కొద్ది ట్రాక్టర్ల,లారీల ఇసుకను తరలించారు. వాగు లో నుంచి కాకపోతే వాగు గర్భంలో నుంచి కూడా ఇసుకను తోడుతుండడంతో భూగ ర్భ జలాలు పడిపోయి చుట్టూ ప్రక్కల ప్రాం తాలకు చెందిన రైతుల పొలాల్లోని బోర్లు ఎండిపోయి సాగునీరు లభించక పంటలు ఎండిపోతున్నాయి.
రైతులు ఆరుగాలం శ్ర మించిన శ్రమ తో పాటు పెట్టుబడి కూడా రావటం లేదు. పైన తెలిపిన గ్రామాల నుం చి వాగులోకి వాహనాలు వెళ్లేందుకు రహ స్య మార్గాలను ఏర్పరచుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా రు. అలా కాకుండా వాహనాలను పట్టుకుని, యజమానులు, డ్రైవర్లు, కూలీలపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని, దొంగతనంగా ఇసుకను రవాణా చేస్తు న్న వారిపై రౌడీ షీట్లు తెరిచి వారిపై నిఘా ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ అధికారులు అయితే పట్టించుకోవడమే మర్చిపోయారని వారి జాడ కూడా కనిపించడం లేదని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు.
సీతారాంపురం శివార్లో రెండు టిప్పర్ల లారీలకు సరిపోను నిల్వచేసిన ఇసుకను శనివారం తాసిల్దార్ భగవాన్ రెడ్డి సీజ్ చేసి ములకలపల్లి లోని కార్యాలయానికి తరలించారు. పోలీసు, రెవెన్యూ, అటవీ అధికా రులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిలో ఎటువంటి భయం, జంకు ఉండ టం లేదు. ఉమ్మడి పూసుగూడెం పంచాయతీలోని కొందరు ఈ ఇసుక వ్యాపారాన్ని వృత్తిగా మలుచుకుని లక్షలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడుసార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ ను ప్రయోగించి ఏడాది పాటు బయటకు రాకుండా కేసులు నమోదు చేస్తే తప్ప ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం అసాధ్యమని ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు.
ఈ అక్రమ రవాణా చేస్తున్న వారు ట్రాక్టర్ల నుంచి లారీ టిప్పర్లు, జెసిబి లు కొనే స్థాయి కి చేరుకున్నారంటే ఈ వ్యాపారం ఏ స్థాయి లో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అని ప్రజలు చెబుతున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఇంజన్, ట్రక్కుకు ఇన్సూరెన్స్ ఉండటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి ఒక్క నయా పైసా కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణా లు కోల్పోయి ఏ దిక్కు లేని వారిగా మారి కుటుంబాలు వీధిపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయని ప్రజలు గుర్తు చేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ,అటవీ, మైనింగ్, రవా ణా శాఖ అధికారులు సమన్వయంతో మూ కుమ్మడిగా దాడులు చేసి పిడి యాక్ట్ ను ప్రయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుం టే తప్ప ఇసుక అక్రమ రవాణాను నిరోధించడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.