calender_icon.png 10 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ సర్కస్‌కు నవ్వులే నవ్వులు

10-11-2025 12:00:00 AM

ప్రియమైన పాఠకులారా.. రాజకీయ ‘కామెడీ ఎక్స్‌ప్రెస్’ రైలు జూబ్లీహిల్స్ స్టేషన్లో ఆగింది. ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఇతర నాయకుల ప్రసంగాల మాటల తూటాలు వింటుంటే, ఈ ఉప ఎన్నిక కేవలం ఒక స్థానానికే కాదు, టాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమాకు అరంగేట్రం లాగా ఉంది. ఇరుపక్షాలు విసిరిన హాస్యం, తీవ్రత, ఆరోపణల ’మికస్డ్ వెజ్ కర్రీ’ ని విశ్లేషిద్దాం.

మనసులో మాట..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికను తమ పాలనకు ‘రెఫరెండం’గా భావించబోమని చెప్పడం, రాజకీయ కామెడీలో క్లైమా కు ముందుగానే లీక్ చేసినట్టు అయ్యింది. ఎన్నికలంటేనే అధికారంలో ఉన్న పార్టీ పనితీరుపై ప్రజాభిప్రాయం అంటారు. కానీ ముఖ్యమంత్రి తాము రెఫరెండంగా చూడట్లేదంటే, ఓటమిని ముందుగానే అంగీకరిస్తు న్నట్టా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం... ప్రశ్న అడిగిన దానికంటే సమాధానంలోనే నవ్వు ఎక్కువగా రావడం విశేషం.

‘బ్యాడ్ బ్రదర్స్’ పల్లీ బఠానీల కథ!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఆర్‌ఆర్ను పల్లీ, బఠానీల్లా అమ్మేశారని ఆరోపించారు. మరోవైపు, కె. తారకరామారావు ముఖ్యమంత్రిని దొంగ హామీలతో గద్దెనెక్కిన నాయకు డు అని తిట్టారు. ఇంత విలువైన ప్రాజెక్ట్ను పల్లీ, బఠానీల్లా ఎలా అమ్మగలరు, అమ్మిన వారు ఎంత చవకగా ఇచ్చారు, అనే ప్రశ్నలు వస్తే... ఇది రాజకీయ ‘ఉప్పూకారం’ మాట తప్ప, నిజంగా పల్లీల రేటుకు అమ్మేస్తే, ఆ కొనుగోలుదారుడే దేశంలో అతి పెద్ద ధనవంతుడు అయ్యేవాడు కదా. ఇలాంటి భారీ ఆరోపణలను చిన్నపాటి స్నాక్సా వినిపిస్తే, పాఠకులకు నవ్వు రాకమానదు.

అప్పుల కథ-లెక్కల మాంత్రికులు..

ముఖ్యమంత్రి రూ.20 లక్షల కోట్ల బడ్జెట్ను దేని కోసం ఖర్చు చేశారో చెప్పాలని బీఆర్‌ఎస్ను ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా, అప్పుల ఫిగర్ మాత్రం మారదు. ఒక ప్రభుత్వం అప్పు చేసిందంటే, తర్వాతి ప్రభుత్వం దాన్ని లెక్కపెట్టి మరీ, ప్రజలకు చెబుతుంది. కానీ, ఆ అప్పులన్నీ దేనికి ఖర్చు చేశారో, వాటి వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందో తెలుసుకోవడానికి మాత్రం రాజకీ య ‘లెక్కల మాంత్రికులు’ మాత్రం ఎప్పు డూ సిద్ధంగా ఉండరు. అందుకే ప్రతి ఎన్నికలలోనూ అప్పుల ‘గోల’ వినిపిస్తూనే ఉంటుంది.

మతపరమైన రాజకీయాలు-మంత్రి పదవి ‘కౌంటర్’

బీఆర్‌ఎస్ నాయకులు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వనందుకు విమర్శించగానే, ముఖ్యమంత్రి హడావుడిగా అజహరుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోగానే, గత్యంతరం లేక ముఖ్యమంత్రి పద వి ఇవ్వడం చూస్తే... మైనారిటీలకు ‘గెలుపు ట్రిక్’ ఎంత బాగా పనిచేసిందో అర్థమవుతుంది. ఆ పదవి ఇచ్చిన తర్వాత, ఎంఐఎం దూరంగా జరగడం చూస్తే, ‘రివర్స్ పాలిటిక్స్’కు జూబ్లీహిల్స్ ఎంత గొప్ప వేదికో తెలుస్తుంది.

బుల్డోజర్ల గారడీ..

కే. తారకరామారావు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడంపై మండిపడ్డారు. మంత్రుల అడ్డగోలు అక్రమ ఫాంహౌస్లు, నిర్మాణాలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని నిలదీశారు. పీదల ఇళ్ల కూల్చివేత అనేది సున్నితమైన అంశం. కానీ మంత్రులు అడ్డగోలుగా కట్టిన ‘అక్రమ ఫాంహౌస్లు’ కూల్చకుండా, వాటిని కేవలం ఎస్‌ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించడం చూస్తే, బుల్డోజర్ రాజకీయాలకు ఎంత ‘కలర్’ ఉందో అర్థమవుతుంది. పేదల ఇళ్లు కూల్చినా, మంత్రుల అక్రమాలు కూల్చకపోయినా, ఇద్దరి లక్ష్యం ఓట్లే కదా.

జవాబుదారీతనం- ఎవరి బాధ్యత?

‘కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి’ అని బీఆర్‌ఎస్ ప్రకటించడం, ఉప ఎన్నికలో అత్యంత ‘నాన్సెన్స్’ ప్రకటన. హామీలు ఇచ్చిందని ఒకరు, కానీ ఆ హామీలు అమలు కావాలంటే ప్రజలు ఇంకొకరిని ఓడించాలంట. అంటే, ఓటమి భయా న్ని తమ ప్రత్యర్థులపైకి నెట్టి, తమ హామీల బాధ్యతను ప్రజలపైకి నెట్టే ఈ కొత్త రాజకీయ వ్యూహాన్ని చూసి, ఓటర్లు బ్రహ్మా నందం కామెడీని గుర్తు చేసుకుంటారు.

సర్కస్ ఎప్పటికీ ఆగదు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక సీటు ఫలితాన్ని మాత్రమే కాదు, రాష్ట్రంలో రాజకీయ కామెడీ స్టాండర్డ్స్ను కూడా నిర్ణయిం చింది. ఫా టాపింగ్, డ్రగ్స్, ఓటుకు కోట్లు కేసుల ఆరోపణల మధ్య, నిజమైన అభివృద్ధి ఎక్కడ ఉందో వెతకడానికి ప్రజలకు బైనాక్యులర్ కావాల్సిం ఏదేమైనా, ఈ ’పవర్ స్టార్స్’ షోను ఆస్వాదించండి, నవ్వుకోండి, కానీ నిజమైన జవాబుదారీతనం కోసం మాత్రం ఓటు వేయడం మర్చిపోకండి సార్.

డ్రగ్స్ వర్సెస్ రౌడీ.. ఎలక్షన్ స్కిట్లో కొత్త పాత్రలు

కే తారకరామారావు హైదరాబాద్‌ను గం జాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని, ఆయన బావమరిది ఇచ్చిన పార్టీలో కొకైన్ సేవించి దొరికిన విషయం నిజం కాదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మరోవైపు, బీఆర్‌ఎస్ నాయకులు తమ అభ్యర్థిని ‘రౌడీ’ అని పిలిచారని విమర్శించారు. ఎన్నికల బరిలో నిలిచిన నాయకులను ‘డ్రగ్స్ అడ్డా’కు కారకులుగా, ‘రౌడీ’ గా పిలుచుకోవడం, విలన్ల ఎంపికలో మన రాజకీయ నాయకులు ఎం త క్రియేటివో చెబుతోంది. అసలు ఓటర్లు ఎవరికి ఓటేయాలి.. ఆరోపణల మధ్య నిజమైన అభివృద్ధి ఎక్కడ ఉంది. అందుకే ఈ ఉప ఎన్నికను ‘సర్కస్’ అనడంలో తప్పేలేదు.

 ఫిరోజ్ ఖాన్, 9640466464