calender_icon.png 10 November, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలకు సొంత భవనాలు కరువు!

10-11-2025 12:00:00 AM

-అరకొర వసతుల మద్య పాలన

-అద్దె గదుల్లో పంచాయతీలు

-భవనాలు పూర్తయ్యేనా..?

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యా యి. అద్దె భవనాల్లో, అంగన్వాడీకేంద్రాల్లో, కమ్యూనిటీహాల్లో కార్యకలా పాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగై న పాలనను అందించాలనే సంకల్పంతో  500పైగా జనాభా కలిగిన పల్లెలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. నూతన పంచాయతీలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న పంచాయతీలకు సొంత భవనాలు లేక ప్రజలు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పంచాయతీల్లో తీరని ఇక్కట్లు..

జిల్లాలో 335 పంచాయతీలు ఉండగా అందులో 174 పాత పంచాయతీలు. 500 పైగా జనాభా కలిగిన మరో 161 గ్రామాలను నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసి పంచాయతీలతోపాటు పాత పంచాయతీలకు కూడా భవనా ల సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల పం చాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్త పంచాయతీలకు ఆయా గ్రామాల్లో  భవనాలు లేక పోవడంతో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీహాల్ వంటి వాటిలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో అద్దె భవనాలు లేక రేకుల షెడ్డులో గ్రామ పంచాయతీ భవనాలు కొనసాగుతున్నాయి. 

గ్రామపంచాయతీ భవనాలు పూర్తయ్యేనా?

జిల్లా లోని పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ భవన నిర్మా ణం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పనులు నిలిచి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొన్ని చోట్ల గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు అరకొర వసతుల నడుమ ఉన్నాయి. పలు భవనాలు శిథిలావస్థలో ఉండి ఎప్పుడు కూలుతాయో తెలియ ని పరిస్థితి నెలకొంది.

నూతన భవన నిర్మాణాలకు చర్యలు తీసుకున్నా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేనితనంతో పాటు నిధుల లేమితో నిలిచిపోయాయి. ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కో జీపీకి రూ.13 లక్షల తో పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారు. నూతన పంచాయతీ లుగా ఏర్పాటు చేయడంతో అందుబాటులో ఉన్న అర కొర భవనంలో పాలన ప్రారంభించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భవన నిర్మాణాలు పూర్యయేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పంచాయతీ భవనాలు పూర్తి చేయాలి

జిల్లాలో అద్దె భవనాలలో గ్రామపంచాయతీలు అరకొర వసతుల మధ్య నడిపిస్తున్నారు. మంజూరైన పంచాయతీ భవనాలను త్వరగా పూర్తిచేసి అందులో యువతకు లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేయాలి. కనీసం ప్రస్తుతం గ్రామ సభలు కూడా నిర్వహించలేని పరిస్థితిలో పంచాయతీలున్నాయి.

 ప్రణయ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు