23-02-2026 12:00:57 AM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, ఫిబ్రవరి 22 : ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లాక్డారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డారం గ్రామంలో నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని.. అంతిమంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతి త్వరలోనే గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఇస్నాపూర్ మున్సిపల్ పాలకమండలి సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మోటె సుమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, రాములు గౌడ్, మోటె కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయానికి భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.