ఎమ్మెల్యే సోషల్ స్టంట్‌లు ఆపండి
- బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాములు
చిన్నచింతకుంట: ఎమ్మెల్యే సోషల్ స్టంట్ లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాములు అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే మండలంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ ఆపాలని,తిట్లలో కాదు” అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
కేటీఆర్, హరీష్‌రావుల గురించి మాట్లాడే స్థాయి లేకపోతే, ముందుగా సొంత మండలంలోని పర్దిపూర్ రైతులు ఎండిపోతున్న పరిస్థితుల్ని చూసుకోవాలని ఆగ్రహంగా అన్నారు. హామీలు నెరవేర్చాలని, స్కూల్ లేకపోతే ప్రజా ఉద్యమం రైతు బంధు, బోనస్, తొలి బంగారు, స్కూటీలు, పింఛలు వంటి ప్రభుత్వ హామీలు ముందు నెరవేర్చాలని కోట రాములు డిమాండ్ చేశారు. మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థలాన్ని వెంటనే మార్చాలని పటిష్టంగా లాంఛనం పెట్టారు. “ఇంట్లా చేయకపోతే ఇక ప్రజాభిప్రాయ సేకరణ ఊపందుకుంటుంది” అంటూ ఫైనల్ వార్నింగ్ నిచ్చారు.
ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు వేయించారని, నీవు తిరిగే రోడ్లు అతని చేతివే అంటూ ఎమ్మెల్యేను సైడ్‌కి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. సొంత ఊర్లోనే ఎన్నికల్లో మేజారిటీ మాకు వచ్చిందని, ఊకచేట్టు వాగు బ్రిడ్జ్‌పై రోజూ వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్న పరిస్థితిలో, దానికి ఎమ్మెల్యే పాత్ర ఏమీ లేదా అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమా? ఎక్కడికి రమ్మంటే వస్తాం, మా అభివృద్ధి చెబుతాం, నీవు చెప్పు అంటూసవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ చిన్నచింతకుంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






