16 April, 2026 | 7:47 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఉమ్మడి జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్

30-10-2025 12:09 AM

 - బోర్నపల్లిలో భారీ వర్షం 

-వరంగల్ - కరీంనగర్ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు 

-అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం

కరీంనగర్, అక్టోబరు 29 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొంథ తుఫాన్ ప్రభావం కనిపించింది. బుధవారం ఉదయం నుంచి తుంపిరిగా మొదలైన వ ర్షం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హుజరాబాద్ డివిజన్లో భారీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా హుజురాబాద్ మండలం బోర్నపల్లిలో 21.11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో బుధవారం సాయంత్రం వరకు 5.8 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది.

అలాగే పెద్దపల్లి జిల్లాలో 2.18, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.09, జగిత్యాల జిల్లాలో 1 ఒక సెంటీమీటర్ సగటు వర్షపాతం నమోదయింది. కరీంనగర్ జిల్లా సై దాపూర్ మండలంలో 11.08 సెంటీమీటర్లు, చిగురుమామిడి 9.82, శంకరపట్నంలో 10.49. గన్నేరువరంలో 6.58. కరీంనగర్ లో  5.18, ఇల్లందకుంటలో 5.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హుజరా బాద్ లో ప్రాంతాలు జలమయమైనాయి. కరీంనగర్-వరంగల్ రహదారిపై రాకపోకల కు అంతరాయం ఏర్పడింది. ఈ రహదారిపై జాతీయ రహదారి పనులు నడుస్తున్నందున భారీ వర్షానికి నీరు ఎక్కడికి అక్కడే నిలిచిపోగా భారీ వాహనాలను హుస్నాబా ద్ మీదుగా కరీంనగర్ కు తరలించారు.

లో యర్ మానేరు డ్యాంకు ఇన్ ఫ్లో పెరగడంతో ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు 18277 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాలుగు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి పంట ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని, కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడవకుండా చూడాలని సూచించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.

గురువారం కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. కరీంనగర్ క లెక్టర్ పమేలా సత్పతి ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 0878-2997247 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలనిసూచించారు.