16 April, 2026 | 1:40 PM

ప్రజల విన్నపానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్

30-10-2025 12:00 AM

ఎల్లారెడ్డి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణం నాలుగో వార్డ్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ ప్రజలు తమ కాలనీలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కి వినతిపత్రం సమర్పించారు. గ్రామస్తులు ముఖ్యంగా ప్రస్తుతం ప్రధాన సమస్య అయినటువంటి ఊర పందుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రస్తావిస్తూ... ఈ ఊర పందులు విచ్చలవిడిగా రాత్రి, పగలు అని తేడా లేకుండా సంచరిస్తూ ఊరు చుట్టుపక్కల ఉన్న చేతికొచ్చిన వరి పంటను ధ్వంసం చేస్తున్నాయని,  కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

వినతిని స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్య ఇదివరకే మా దృష్టిలో ఉంది, సమస్యను  అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తున్నాం. త్వరలోనే రెండు మూడు రోజుల్లో ఊరిపందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అని హామీ ఇచ్చారు.  గ్రామస్తుల విన్నపంపై తక్షణమే తమ సమస్యలపై స్పందించిన మున్సిపల్ కమిషనర్  చొరవను దేవునిపల్లి ప్రజలు ప్రశంసించారు. త్వరలో తమ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవుతాయనే భరోసా కల్పించిన మున్సిపల్ కమిషనర్ గారికి దేవునిపల్లి గ్రామస్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.