భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
30-06-2024 04:29 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భార్యలు కలిసి భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేశారు. ఈ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో జరిగింది. పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో అప్పలమ్మ అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పండన్న అప్పలమ్మ దంపతులకు 2007లో ఒక కొడుకు పుట్టాడు. రెండో సంతానం కావాలని భర్త భార్యలను కోరాడు. ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించారు. అనంతరం భర్తకు లావ్య అనే యువతితో మూడో పెళ్లి చేశారు. ఈ ఘటన ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.






