శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులు అరెస్ట్
30-06-2024 04:53 PM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలతో ముగ్గురు కస్టమ్స్ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. కస్టమ్స్ అధికారులు శ్రీనివాసులు, పంకజ్ గౌతమ్, చక్రపానిని అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించారని ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వారిని విచారి స్తున్నట్లు సమాచారం.






