10 July, 2026 | 7:19 AM

హనుమకొండలో వింత ఘటన.. అవాక్కయిన పోలీసులు

10-06-2024 05:44 PM

హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. హనుమకొండ పట్టణంలోని రెండవ డివిజన్ రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు మృతిచెందాడని భావించి స్థానిక కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే అనుమానించారు. అనంతరం ఒకరి చేయి మరొకరు పట్టుకొని బయటకు తీసే క్రమంలో తాను ఒక్కసారి లేవడంతో పోలీసులతో పాటు అక్కడున్న వారు అవాక్కయ్యారు. అతన్ని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసుల సమయం, 108 సిబ్బంది సమయం వృధా చేయడంతో ఆ వ్యక్తిని స్టేషన్ కు తరలించారు.