పురుగుమందు సీసాతో ప్రజావాణికి రైతు
నిన్నెలా : మంచిర్యాల జిల్లా నిన్నెలా మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి లో చిత్తాపూర్ గ్రామానికి చెందిన రైతు జనార్ధన్ తన బాధను పురుగుమందు సీసా పట్టుకొని వెల్లడించాడు. డిఆర్ డిఎ ఐకెపీ ద్వార ఏర్పాటు చేసిన మామిడి కొనుగోలు కేంద్రానికి తన మామిడి పంటను అమ్మానని, ఇలా తనతోపాటు దాదాపు 20 మంది రైతులు పంటను అమ్మారని చెప్పాడు. తనకు దాదాపు లక్షన్నర డబ్బులు రావాలని, నెల గడిచిన ఐకెపీ సిబ్బంది అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని వాపోయాడు. కొనుగోలు చేసే ముందు కిలోకు 35 ధర చేసి ఇప్పుడు మాత్రం కిలోకి రూ.25 నుంచి 28 వరకు ఇస్తామంటున్నారని చెప్పాడు. దీంతో విసుగు చెందిన జనార్ధన్ ప్రజావాణిలో పురుగుల మందు డబ్బతో వచ్చి పిర్యాదు చేశాడు. న్యాయం చేయకుంటే ఇక్కడే చనిపొతానని మందు డబ్బా తీసి ఎంపిడివో దేవేందర్ కు విన్న వించినా ఆయన ఫిర్యాదు చేయమని చెప్పాడు. కానీ మందు డబ్బాను రైతు నుంచి లాక్కోలేదు.. కనీసం వారించ లేదని రైతు జనార్థన్ తెలిపాడు.






