15 April, 2026 | 9:58 AM

వ్యాధుల కట్టడికి ఎంఎస్‌యూల బలోపేతం

04-02-2026 01:11 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): నగరాల్లో ప్రజారోగ్య పరిరక్షణలో మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూని ట్లు మొదటి వరుస రక్షణ వ్యవస్థగా పనిచేయాలని, అప్పుడే వ్యాధుల వ్యాప్తిని  అడ్డుకోగలమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉద్ఘాటించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో హైదరాబాద్, బెంగళూరు, థానే నగరాలకు చెందిన ఎంఎస్‌యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల ఉమ్మడి ఇండక్షన్ ట్రైనింగ్‌ని ఆయన ప్రారంభించారు.