4 June, 2026 | 3:00 AM

ప్రజా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతం

04-06-2026 02:30 AM

ఖానాపూర్‌జూన్ 3 ( విజయ క్రాంతి) ఖానాపూర్ మండలం బాధనకుర్తి లో నూతన పాఠశాల భవనాన్ని  ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బుధవారం ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యేకుగ్రామస్తులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు   ఘన స్వాగతం పలికారు,టెంకాయ కొట్టి తరగతి గదులను ప్రారంభించారు.విద్యార్థులతో గదులు తిరుగుతూ బెంచ్ పై కూర్చొని ముచ్చటించారు,ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో విద్య వ్యవస్త బలోపేతం అవుతుంది ,

అని పాఠశాలల నూతన భవనాలు,విద్యార్థుల సౌకర్యార్థం ల్యాబ్స్, కిచెన్ షేడ్స్,అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నాం అన్నారు.పాఠశాలలో కావలసిన వసతులు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు,కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవారి సంక్షేమ పథకాలు అందుతున్నాయి,ఇందిరమ్మ ఇండ్లు విడతల వారిగా ప్రతి పేదవారికి ఇస్తాం,మీ గ్రామంలో కావలసిన సీసీ రోడ్స్,గ్రామ అబివృద్ధి కృషి చేస్తాం అన్నారు,ప్రతి ఒక్కరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి,వారికి కావలసిన అన్ని వసతులు,సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు.