24 August, 2026 | 10:20 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

కల్తీపై కఠిన చర్యలు

12-06-2024 12:30 AM

హైదరాబాద్ బిర్యానీ పేరు ఖరాబ్ చేయొద్దు

నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించండి

ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్

హోటళ్లకు 6 నెల్లకోసారి అవగాహన సదస్సులు

హోటల్స్ అసోసియేషన్ల సమావేశంలో మంత్రి దామోదర

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): హోటళ్లలో తినాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో ఆలోచించుకోవాలని హోటళ్ల యాజమాన్యాలకు రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. హోటళ్ల యజమానులు బాధ్యతతో వ్యాపారం చేసి ప్రజల మన్నన పొందాలని పిలుపునిచ్చారు.

నిజాం కాలం నుంచి వస్తున్న ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్ బిర్యానీ పేరు ఖరాబ్ చేయవద్దని కోరారు. ప్రజలకు కల్తీలేని నాణ్యమైన ఆహారం అందిస్తేనే ఆహార పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. ఫుడ్‌సేఫ్టీ కమిషనర్ బృందం తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ హోటళ్లలన్నింటిలో కల్తీ ఆహారం, కాలం చెల్లిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలిన నేపథ్యంలో ఆహార పరిశ్రమకు చెందిన పలు సంఘాలతో సచివాలయంలో మంత్రి దామోదర మంగ ళవారం సమావేశమయ్యారు.

తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిలర్స్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. ఆహారం కల్తీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ప్రజలకు ఆహారం ఉచితంగా అందించడంలేదని, వారు డబ్బులు చెల్లించే భోజనం చేస్తున్నారనే విషయాన్ని హోటళ్ల యజమానులు గుర్తుంచుకోవాలని స్పష్టంచేశారు. 

మీ పొట్ట మీరే కొట్టుకోవద్దు

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఏ చిన్న విషయమైనా వెంటనే ప్రజలకు తెలిసిపోతుందని, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో హోటళ్లలో కల్తీ ఆహారం బయటపడుతున్న విషయం క్షణాల్లో ప్రజలకు చేరుతున్నదని గుర్తుచేశారు. హోటళ్లలో నాణ్యమైన ఆహా రంలేకుంటే తినేవారుండరనే విషయా న్ని గుర్తించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఇలాం టి సమయంలో హోట ళ్లలో ఆహారం ఇంకా నాణ్యత పెరిగితే వ్యాపారం రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.