24 August, 2026 | 4:35 PM

ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం

12-06-2024 12:36 AM

తెలంగాణ, కర్ణాటకలో పథకం తీరును పరిశీలించిన అధికారులు

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి)ః ఏపీలో ఎన్‌డీఏ కూటమి కీలక హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి  ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది  రాష్ట్రానికి అమలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథ మికంగా ఒక నివేదికను సిద్ధం చేశారు. దీని ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే రాష్ట్రానికి సరిపోతుందని అధికారు లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్క డి మాదిరిగానే  రాష్ట్రంలో కూడా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నా యి. అదే విధంగా విజయవాడ, విశాఖపట్నం, నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి.   కొత్త ప్రభుత్వ నిర్ణయాలపై విధివిధానాలు ఆధార పడి ఉంటాయి.