6 April, 2026 | 4:55 PM

Breaking News

కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •  

అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు

06-04-2026 03:15 PM

గుండాల,(విజయక్రాంతి): మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీస్కుంటామని మండల అధికారులు హెచ్చరించారు. సోమవారం స్థానిక అధికారులు ఎస్సై సైదా రావుఫ్, తహసీల్దార్ ఖాసీం, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా అక్రమ ఇసుక రవాణా మరియు త్రవ్వకాలను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సాయనపల్లి గ్రామ సమీపంలోని కిన్నెరసాని వాగు వంతెన వద్ద జేసీబీ తో రెండు గుంతలు త్రవ్వించి అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించే మార్గాన్ని మూసివేసి ఆ దారికి అడ్డుకట్ట వేశారు. మండలంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేయటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని స్థానిక ఎస్సై సైదా రావుఫ్ ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించారు.