7 April, 2026 | 2:59 AM

అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు

07-04-2026 01:05 AM

గుండాల, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీస్కుంటామని మండల అధికారులు హెచ్చరించారు. సోమవారం స్థానిక అధికారులు ఎస్త్స్ర సైదా రావుఫ్, తహసీల్దార్ ఖాసీం, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా అక్రమ ఇసుక రవాణా మరియు త్రవ్వకాలను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా సాయనపల్లి గ్రామ సమీపంలోని కిన్నెరసాని వాగు వంతెన వద్ద జేసీబీ తో రెండు గుంతలు త్రవ్వించి అక్రమ ఇసుక రవాణాకు ఉపయోగించే మార్గాన్ని మూసివేసి ఆ దారికి అడ్డుకట్ట వేశారు. మండలంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే ఆ వాహనాలను సీజ్ చేయటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని స్థానిక ఎస్త్స్ర సైదా రావుఫ్ ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించారు.