30 May, 2026 | 1:46 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

30-05-2026 01:12 AM

కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి

కొల్చారం, మే 29 : కొల్చారం  మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను మండల్ టాస్క్ఫోర్స్ కమిటీ శుక్రవారం తనిఖీ చేసింది. ఈ కమిటీలో కౌడిపల్లి ఏడిఏ పుణ్యవతి, కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసచారి, మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి సభ్యులుగా పాల్గొన్నారు. మండల కేంద్రమైన కొల్చారం,

పోతంశెట్టిపల్లి గ్రామా లలోని  ఆగ్రోస్, దుర్గ భవాని, మల్లికార్జున ఫర్టిలైజర్స్ దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రిజిస్టర్లను అధికా రులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకా లంలో అందించాలని డీలర్లకు సూచించా రు. ప్రతి డీలర్ రోజువారీ క్రయవిక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, స్టాక్ బోర్డులను వినియోగదారులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు.