30 May, 2026 | 1:46 AM

హామీల అమలు మరిచారంటూ..

30-05-2026 01:08 AM

బతుకమ్మతో ఉపాధి కూలీల వినూత్న నిరసన

నంగునూరు, మే 29 : అధికారంలోకి వచ్చి ఉయ్యాలో.. హామీల అమలు మరిచి ఉయ్యాలో...అంటూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండంరాజుపల్లిలో ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. శుక్రవారం పనుల విరామ సమయంలో కూలీలంతా ఒక్కటై బతుకమ్మ ఆడుతూ,ఉయ్యాల పాటల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.కూలీలు తమ కష్టాలను పాటలుగా మలిచి పాడిన ఈ నిరసన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి,

జోరుగా చక్కర్లు కొడుతోంది.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేస్తే.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం వాటిని మరిచిపోయిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుబంధు సాయం అందకపోవడం,పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడం,ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు,వడ్లు పేరుకుపోయి రైతులు నష్టపోతున్నా అధికారులు, మిల్లర్లు పట్టించుకోవడం లేదని పాటల ద్వారా ఏకరువు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.