చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు
14-06-2024 12:10 AM
రంగారెడ్డి కలెక్టర్ శశాంక
రంగారెడ్డి, జూన్ 13 (విజయక్రాం తి): చెరువులు, కుంటల ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. భవిష్య త్తు తరాల కోసం చెరువులు, కుంటలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికా రులదేనని అన్నారు. గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జోన ల్ కార్యాలయం ఆవరణలో జోనల్ కమిషనర్ స్నేహతో కలిసి చెరువుల పరిరక్షణపై జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుల చుట్టూ రక్ష ణ కంచె ఏర్పాటు చేయడంతో పాటు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణలు చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. చెరువుల పరిరక్షణపై అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని తెలిపారు.






