29 June, 2026 | 12:57 AM

గ్రామాల అభివృద్ధికి కృషి

14-06-2024 12:10 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు, జూన్ 13: పటాన్‌చెరు నియోజకవర్గంలోని గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా నిధులు కేటా యిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండల కేంద్రం లో హానర్ ల్యాబ్స్ పరిశ్రమ సౌజన్యంతో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామా ల్లో అంతర్గత రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలపై దృష్టి పెట్టామన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిలో అందరూ కలిసి రావాలన్నారు.  జెడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, నర్సింహా రెడ్డి, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.