మాజీ ఎమ్మెల్యే గురువారెడ్డి సేవలు చిరస్మరణీయం
14-06-2024 12:10 AM
సిద్దిపేట, జూన్ 13 (విజయక్రాం తి): సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఏడ్ల గురువారెడ్డి సేవలు చిరస్మరణీయమని సీపీఐ జాతీయ నాయకుడు చా డ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా గురువారం సిద్దిపేట పట్టణంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమం లో సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్, సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ రాజనర్సు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.






