15 May, 2026 | 9:49 PM

Breaking News

అనుమతులు లేని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లపై చర్యలు తప్పవు : జిల్లా వైద్యశాఖ హెచ్చరిక

15-05-2026 09:16 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లను అధికారుల బృందం తనిఖీ చేసింది. డాక్టర్ రామదాసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో అమూల్య డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రమోద్ డెంటల్ ఆసుపత్రి, సుశ్రుత హాస్పిటల్, నాగార్జున డెంటల్, సింగరేణి ఏరియా ఆసుపత్రులను పరిశీలించారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు లేదా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత నిర్వాహకులను హెచ్చరించారు. తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారికి సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.