04-07-2025 01:23:04 AM
కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో డీఏపీ, యూరియా కొరత లేదని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ని జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శిం చారు.
ఈ సందర్భంగా డీఏపీ, యూరియా పంపిణీ వివరాలను అడిగి తెలుసుకుని, స్టాక్ రిజిస్టార్ ను పరిశీలించారు. ఎరువులు ప్రస్తుతం నిలువ ఉన్న యూరియా, డీఏపీ ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సకాలంలో పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి జంగమ్వర్, సీఈఓ గంగన్న, పలువురు అధికారులు, రైతులు ఉన్నారు.
అనంతరం జైనథ్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించే ఆహారం వివరాలు, వంటగది, తదితర పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో భోజనం చేస్తూ ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని మళ్ళీ కేజీబీవి సందర్శించినప్పుడు మీరు నేర్చుకున్న అభ్యాస సామర్థ్యాల పై, ఇంగ్లీష్ లో మాట్లాడడం, చదవడం పై అడిగి తెలుసు కుంటానని ఆన్నారు. చదువు పై ప్రత్యేక శ్రద్ద వహించి, ఆరోగ్య పాఠశాల లో పొందుపరిచిన ఆరు సూత్రాల పై అవగాహన చేసుకోవాలని విద్యార్ధులకు తెలిపారు..