04-07-2025 12:47:29 PM
హైదరాబాద్: కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ మైనింగ్ సదస్సు(World Mining Conference) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. స్థానికుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కోల్ ఇండియా చర్యలు తీసుకుంటుందని కిషన్ రెడ్డి(Kishan Reddy) సూచించారు. అత్యాధునిక సాంకేతికత వినియోగించి ఖనిజాల ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఖనిజాల తవ్వకంలో కోల్ ఇండియా పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. 500 మినరల్ బ్లాక్స్ లో లీజ్ రెన్యువల్ సులభతరం చేస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. లీజ్ రెన్యువల్ కు సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తెచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలోకి కూడా కోల్ ఇండియా(Coal India Limited) అడుగుపెట్టిందని వెల్లడించారు.