calender_icon.png 4 July, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోశయ్య సేవలు చిరస్మరణీయం

04-07-2025 12:23:30 PM

  1. ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకలు 
  2. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్​నగర్, (విజయక్రాంతి): దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సేవలు చిరస్మరణీయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన రోశయ్య జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ చరిత్రలో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఘనత సాధించారని చెప్పారు. మచ్చలేని నాయకుడని ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించే మహోన్నత వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు శాంతన్న యాదవ్, శ్రీశైలం, ప్రవీణ్ కుమార్ డివైఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.