04-07-2025 01:01:33 PM
పాల్గొన్న ఎస్పి శరత్ చంద్ర పవార్
నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని(Rosaiah Jayanthi) పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్( SP Sharath Chandra Pawar) ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పని చెయ్యడం తో పాటు ఆయన రాజకీయ జీవితంలో ప్రజాసేవలో నిమగ్నమై, చేసిన సేవల గురించి కొనియాడాడు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఏ. ఆర్ డీఎస్పీ శ్రీనివాస్,డి.సి.ఆర్.బి సీఐ శ్రీను,ఆర్.ఐ సంతోష్,పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.