calender_icon.png 4 July, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్

04-07-2025 01:28:57 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Kalvakuntla Taraka Rama Rao)ఎక్స్ వేదికగా స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని వెల్లడించారు. కేసీఆర్ బ్లడ్ షుగర్, లో సోడియం లెవెల్స్ చూస్తున్నారని తెలిపారు. కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారని సూచించారు. కేసీఆర్ కు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ క్షేమం గురించి ఆరా తీస్తున్న వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

''కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా నిన్న సాయంత్రం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి, రెండు రోజులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో జూలై 3న చేరిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంది. ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి కేసీఆర్ ను పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లోని వైద్యుల బృందం 71 ఏళ్ల కేసీఆర్‌ను పరీక్షిస్తోంది. కేసీఆర్ సాధారణ బలహీనత గురించి ఫిర్యాదు చేయడంతో వైద్యులు అడ్మిట్ చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక దర్యాప్తులో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నాయని తేలింది.