16 May, 2026 | 4:50 PM

దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

16-05-2026 04:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బంగల్పేటలో సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ గారు మాట్లాడుతూ దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలియజేశారు.  ప్రతి మంగళ వారం శుక్రవారం డ్రై డే పాటించి దోమల ను లార్వాదశలోనే అరికట్టాలని తెలియజేశారు. 

డెంగ్యూ వ్యాధి లక్షణాల గురించి, వ్యాధి నియంత్రణకు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అనంతరం  డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా  విపత్తులు సంభవించినప్పుడు ఆరోగ్యశాఖ తీసుకోవాల్సిన చర్యలు గురించి,  సోమవారం నిర్వహించబోయే మాక్ డ్రిల్ గురించి  సిబ్బంది యొక్క బాధ్యతల గురించి చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వివరించారు.