28 May, 2026 | 2:45 AM

అక్రమ రవాణా నిరోధం కోసం పటిష్టంగా వాహనాల తనిఖీలు

28-05-2026 01:51 AM

పాలకవీడు, మే 27ప్రజలకు మెరుగైన సేవలు అందించడం భద్రత కల్పించడం లక్ష్యంగా, బక్రీద్ పండుగ సందర్బంగా గోవు లు, పశువుల అక్రమ రవాణా నిరోధం లో భాగంగా బుధవారం పాలకవీడు పోలీస్ స్టేషన్ పరిధి లో జానపహాడ్ బ్రిడ్జ్ వద్ద పోలీ సు కట్టడి ముట్టడి, నాకాబంది కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్‌ఐ.కోటే ష్ మాట్లాడుతూ అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలు అనుమానిత వ్యక్తుల కదలికుల నిర్మూలన లక్ష్యంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహించి ప్రతి వాహనాన్ని క్షు ణ్ణంగా తనిఖీలు చేశామని అన్నారు. పశువులు, గోవుల అక్రమ రవాణా పై నిఘా పె ట్టాం , పేలుడు సామాగ్రి, మారణాయుధా లు తరలింపు ఏమైనా జరుగుతుందా అని పరిశీలించడం జరిగినదన్నారు. గూడ్స్ వా హనాల్లో ప్రయాణికులను ఎక్కించవద్దు అన్ని ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో పోలీ స్ సిబ్బంది పాల్గొన్నారు.