calender_icon.png 5 July, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె

05-07-2025 12:00:00 AM

కొండాపూర్, జూలై 4 : కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగానే ఈ నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను క్రౌన్ బీర్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సిఐటియు యూనియన్ సమ్మెవాల్ పోస్టర్ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం సిఐటియు యూనియన్ జనరల్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ కార్మి కులు దశాబ్దాల తరబడి పోరాడి కార్మిక హక్కులను ఎలాంటి చర్చ లేకుండానే కేంద్రం నిరంకుశంగా రద్దు చేసిందని అన్నారు.

  లేబర్ కోడ్ల రద్దుకు ఈనెల 9న జరిగే సమ్మెలో మండల కార్మికు లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  యూనియన్ ఆర్గనైజర్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఎర్రోళ్ల రవి, శివయ్య, లక్ష్మణ్, మురారి, సింగ్, కాంట్రాక్టు యూనియన్ జనరల్ సెక్రెటరీ వెంకట్ రెడ్డి, మాజీఆర్గనైజర్ సెక్రెటరీ సుధీర్ రెడ్డి, కొత్తగాడి రవి, విల్సన్, కుమార్, నర్సింలు పాల్గొన్నారు.