04-07-2025 11:46:00 PM
నూతనకల్,(విజయక్రాంతి): నూతనకల్ మండల పరిధిలో వెంకేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత పై శుక్రవారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ చరణ్ నాయక్ మాట్లాడుతూ... వర్షాకాలంలో వర్షాలు పడడం వలన మన ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమల స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అవి కుట్టడం వలన మలేరియా, డెంగ్యూ,చికెన్ గున్యా వ్యాధి గ్రస్తుల నుండి ఒకరి నుండి మరొకరికి కుట్టి వ్యాప్తి చేస్తాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ వర్ష కాలంలో నీరు కలుషితం కావడం వలన,కలుషితమైన ఆహారం పదార్థాలు, ఈగలు వాలిన ఆహార పదార్థాలు తినడం వలన , టైఫాయిడ్,నీళ్ల విరేచనాలు,బంక విరేచనాలు, కలరా సంభవించే అష్కరం ఉన్నందున వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అన్నారాయనన్నారు వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, ఆయన సూచించారు,