16 April, 2026 | 11:26 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

డీసీ రవీందర్‌రెడ్డికి సమ్మె నోటీస్

04-02-2026 12:28 AM

12న దేశవ్యాప్త సమ్మె

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 3: నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డికి ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వ డం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల నరసింహ మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోర్డులను, తీసుకొచ్చి కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తుందని విమర్శించారు.

కనీస వేతనాలు అడగకుండా, యాజమా న్యం చెప్పిన మాటే వేదంగా చేసి, కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా చట్టాలను మార్చివేసి కార్మికులని రోడ్డున పడేసే విధంగా తీసుకొచ్చిన నాలుగు కోర్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కావున 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను అన్ని రం గాల కార్మికులు పాల్గొని జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమం లో సీఐటీయూ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.