17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

04-02-2026 12:28 AM

జనగామ, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించబడిన జనరల్ అబ్జర్వర్ ఎ. నర్సింహా రెడ్డి ఘనపూర్, జనగాం మున్సిపాలిటీ పరిధిలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్రం, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ మరియు స్ట్రాంగ్ రూమ్ ను మంగళవారం సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు.జన రల్ అబ్జర్వర్కు ఎన్నిక లకు సంబందించిన ప్రస్తుత ఏర్పాట్లు అలాగే తీసుకుంటున్న చర్యలపై అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రతా చర్యలు, మెటీరియల్ నిల్వ విధానం, సీసీ కెమెరా పర్యవేక్షణ, రికార్డ్ నిర్వహణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు అబ్సర్వర్ సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా... సజావుగా నిర్వహించడానికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండ కూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మాతృ నాయక్, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.