calender_icon.png 20 December, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యధిక కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి

20-12-2025 01:18:42 AM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19, (విజయక్రాంతి):డిసెంబర్ 21వ తారీకున  జర గనున్న జాతీయ లోక్‌అదాలత్ ను విజయవంతం చేయాలని ఎస్ యు కె జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీటింగ్  హాలులో కోర్ట్ కానిస్టేబుల్స్ లతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి ఎం. రాజేందర్  అన్నారు. రాజీకాదగిన పెండింగ్ క్రిమినల్ కేసులు , ఇ -పిటి కేసుల వివరాలను ఠాణాల వారిగ అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరు సమన్వయంతో పని చేయాలని తె లిపారు. ఈ సారి జరిగే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసులను పరిష్కరించడం ద్వారా జిల్లాను  ఉన్నత స్థానంలో తీసుకురావడం కోసం పోలీస్ అధికారులు కృషి చే యాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రాజమల్లు, కోర్టు కానిస్టేబుల్స్, రామిశెట్టి రమేష్ పాల్గొన్నారు.