calender_icon.png 20 December, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీని సందర్శించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్

20-12-2025 01:17:29 AM

మణుగూరు, డిసెంబర్19, (విజయక్రాంతి)ముత్యాలమ్మ నగర్ లోని ప్రభుత్వ ఐటిఐ లోని ఏటీసీ కేంద్రాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కే. విజయభాస్కర్ రెడ్డి శుక్రవా రం సందర్శించారు. ఏటిఐలో ఉన్న కోర్సుల వివరాలు వాటికి సంబం ధించిన యంత్ర పరికరాలను పరిశీలించి, విద్యార్థులకు ఇస్తు న్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాటు చేస్తోన్న అడ్వా నస్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) ద్వారా ఉపాధి భరోసా అందుతుంద న్నారు.యువత, విద్యార్థులకు ఉపాధి, ఉద్యో గ అవ కాశాలు కల్పించడంలో ఏటీసీ కేం ద్రాలు కీలకంగా నిలుస్తాయన్నారు.

ప్రభు త్వం కల్పిస్తున్న అవకాశాలను ఏజెన్సీ ప్రాం త విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపాల్ జి రవి, భద్రాచలం, ఇల్లందు, మ ణుగూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీ సర్లు ఏసుపాదం, పీవీకే శర్మ, బి.ఎన్ రాజు ఐటిఐ ఏటీసీ సిబ్బంది పాల్గొన్నారు.