16 April, 2026 | 10:06 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

జిల్లాలో పశువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు

31-05-2025 12:21 PM

అక్రమ రవాణా పాల్పడే వారి పై కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, (విజయక్రాంతి): బక్రీద్ పండుగను(Bakrid Celebrations) పురస్కరించుకొని పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 7 న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులు, కోడె దూడలను అక్రమంగా తరలించకుండా జిల్లాలో 3 చెక్ పోస్ట్ లను బసంత్ నగర్ దుబ్బపల్లి, గుంపుల వద్ద  ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహిస్తున్నారని, ఈ చెక్  పోస్టుల 24 గంటల పాటు పనిచేస్తాయని అవసరమైతే మరో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పశువుల తరలించే వాహనం వాహన డ్రైవర్ వివరాలు ఉన్న వారి అమ్మిన వారి వివరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారని వివరాలను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. మరియు పశువుల మార్కెట్  (సంత)లో  కూడా  పశువులను కొనడం కానీ అమ్మడం కానీ చేయడం  వెంటనే నిలిపివేయాలని, బక్రీద్ పండుగకు అక్రమంగా ఆవులు ఎద్దులు లేక దూడలను రవాణా అడ్డుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.