calender_icon.png 18 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి

18-09-2025 12:00:00 AM

  1. ప్రైవేట్ పార్ట్‌పై కాళ్లతో తన్నిన వైనం
  2. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో దారుణం 

ఉప్పల్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి)ః రోజురోజుకు సూళ్లలో ర్యాగింగ్ భూతం పడగలు విప్పుతుంది. మొన్న బోడుప్పల్ స్కూల్‌లో ర్యాగింగ్ మరవకముందే తాజా గా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్కూల్‌లో తొమ్మిదివ తరగతి చదువుతున్న విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేసి ప్రైవేట్ పార్ట్ పై కాళ్లతో తన్నినట్లు బాధితుడి తల్లిదండ్రులు వాపోయారు. ప్రైవేట్ పార్ట్ మొత్తం వాచిపోయి రక్తస్రావమైనప్పటికీ ఈ విషయాన్ని సదరు ప్రిన్సిపాల్‌కు తెలియజేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపించారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సం ఘటన  గుట్టు చప్పుడు కాకుండా నాచారం పోలీసులు  ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమాని, అక్కడ పనిచేసిన ఇన్‌చార్జిలపై  కేసు నమోదు చేశారు. కాగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనపై  స్థానిక పోలీసులు యజమాని ఎమ్మెల్సీ కావడంతో విచారణ సరిగా జరగలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గాయాల పాలైన మా అబ్బాయి పరిస్థితి మూడు నెలలు గడిస్తే కానీ ఏ విషయమైనా చెప్పలేరు అని వైద్యులు చెబుతున్నారని  విద్యార్థి తల్లిదండ్రులు  మీడియాకు తెలిపారు తమ కుమారుడికి ఏదైనా జరిగితే  ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యజమానిది బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.