calender_icon.png 17 September, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిస్మత్‌పూర్ బ్రిడ్జి కింద యువతి మృతదేహం

17-09-2025 02:19:46 AM

లైంగిక దాడి చేసి, హత్య?

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 16: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ బ్రిడ్జి కింద మంగళవారం గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తిం చి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ క్యాస్ట్రో మృతదేవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగి మూడు రోజులు ఉండొచ్చని సీఐ పేర్కొన్నారు.

హత్యకు గురైన యువతి వయసు దాదాపు 25 నుంచి 30 మధ్యలో ఉంటుందని, సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు, ఘటన స్థలంలో క్లూస్ టీం ద్వారా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా యువతిపై లైంగిక దాడి చేసి, వివస్త్రను చేసి హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.