15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వీడియో కాల్ మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్య

08-02-2026 07:43 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): ప్రియురాలితో వీడియోకాల్ మాట్లాడుతూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి కుమారుడు గంగాధరి అభినవ్ (17) ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం మేడిపల్లిలోని ఓ కార్ల షోరూం లో ప్రాక్టికల్ ట్రైనింగ్ లో ఉన్నాడు.

ఈ నెల 5న రాత్రి తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రేమించిన అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసు కున్నాడు. వెంటనే ఆ అమ్మాయి అతని స్నేహితులకు చెప్పడంతో వారు ఇంటికి వెళ్లి డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. అనంతరం అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.